సీఎం కిరణ్ కుమార్ రెడ్డి! మంచి విద్యా వంతుడు....
అలాంటి ఒక నాయకుడు...రచ్చ బండ కార్యక్రమానికి వెళ్ళి...
పేదల సమస్యల ను అడిగే క్రమంలో.... ఒక వృధా మహిళ అయ్యా... నాకు తెల్ల రేషన్ కార్డు లేదు..
అధికారులేమో తెప్పించుకున్తున్నాను కానీ పని చేయట్లేదు అంటే.....
మన ప్రియతమ నేత ప్రతి స్పందన.. సభ్య సమాజం సిగ్గుపడేలా వుంది..
అమ్మా నీది ఏ వార్డు!
నీది ఈ వార్డు కాదు..కదా.... నీ వార్డు లో రచ్చ బండ జరిగినప్పుడు నీ సమస్యను చెప్పు అని ...
ఆమె ఇచ్చిన వినతి పత్రాన్ని చెత్త బుట్ట దాఖలాలు చేసిన పెద్దమనిషి... మన సీఎం..
రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్న నేత వ్యవహరించే పద్ధతేనా ఇది????
ఇలాంటి వ్యక్తికి నైతికంగా....అసలు నాయకుడిగా వుండే అర్హత లేదు....
****ఇలాంటి వ్యక్తులను ఎన్నుకునేందుకేనా...మన ప్రజా ధన్నాన్ని వృధా చేసుకొని మరీ... నెత్తిన కూర్చోబెట్టుకుంటున్నాం!
ప్రజల కష్టాలకు ఆసరాగా ఉండేందుకు తప్పించుకో జూసిన ఇదే ముఖ్యమంత్రి...
అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ముగ్గరు మంత్రులకు న్యాయ సహాయం చేసేందుకు ప్రభుత్వ సహాయం అందిస్తాడంట...
లక్షల రూపాయలు ప్రతి నెలా గౌరవ వేతనాలు తీసుకునే ఈ నేతలకు డబ్బు కొదవా!
ఇంత కంటే సిగ్గు మాలిన పని ఇంకొకటి లేదు....
****ఒక ప్రభుత్వాసుపత్రిలో... "వీణా -వాణీ" అవిభక్త కవల తల్లి దండ్రులు ఎన్నో ఏళ్ళగా వారిని విడదీసి వారి జీవితాలలో వెలుగులు నింపమని ప్రభుత్వ నేతల కాళ్ళా వెళ్ళా పడుతున్నా...
దున్న పోతుమీద వర్షం పడ్డట్లు వ్యవహరించే ఈ నేతలు... ఇలాంటి విషయాలలో...
పెద్దలకు అడుగులకు మడుగులోత్తేలా.... ప్రభుత్వపని తీరును మార్చేస్తుంటే....
ఇంకెంత కాలం....ఏ అన్యాయ పరిపాలన క్రింద పేద బ్రతుకులు నలిగి పోవాలి!


0 comments:
Post a Comment