అపుడెపుడో బాబు(చంద్ర బాబు) గారు చేసింది కూడా అదే కదా తెలుగు తమ్ముళ్ళు!

Tuesday, 10 July 2012


కొడాలి నాని...వైకాపా లోకి చేరబోతున్నాడని తెలిసి తెల్లు దేశం నాయకులు టీవీ ల ముందుకొచ్చి మైకులు పట్టుకొని...
డబ్బులకు అమ్ముడుపోయి పార్టీలు మారే వారివల్ల మా పార్టీకి వచ్చిన నస్టమేమీ లేదు అని
ఒక్క మాటలో విశ్లేషించేసారు....
**** ఈ మాట అంటున్నప్పుడు కనీసం ఒక్కసారైనా అనుకొని ఉండరా???.
ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుని  రాజకీయ ప్రయాణాన్ని మరచి పోయి మాట్లాడుతున్నట్లుంది...

"డబ్బులకు అమ్ముడు పోయి పార్టీ మారేవాళ్ళు" అని ఎద్దేవా చేసారు.. నాని ని ఉద్దేశించి!
కాని అది ముందు నానీ కి కాదు వర్తించేది!

కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రిగా వెలగ బెట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా డబ్బులకు అమ్ముడుపోయే తెలుగు దేశం పార్టీ లోకి మారారా!

తెలుగు దేశం నాయకుల మాటల బట్టి చూస్తే మాత్రం
అంతే అన్నట్లుంది!  

ఇలాంటప్పుడే ఓ సామెత గుర్తొస్తుంది!
"తాను చేస్తే శృంగారం... మరొకరు చేస్తే వ్యభిచారమని !"

మనదీ ఒక బ్రతుకేనా.... కుక్కల వలె నక్కలవలె... మనీ ఒక బ్రతుకేనా .... సందులలో పందులవలె!


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి! మంచి విద్యా వంతుడు....
అలాంటి ఒక నాయకుడు...రచ్చ బండ కార్యక్రమానికి వెళ్ళి...
పేదల సమస్యల ను అడిగే క్రమంలో.... ఒక వృధా మహిళ అయ్యా... నాకు తెల్ల రేషన్ కార్డు లేదు..
అధికారులేమో తెప్పించుకున్తున్నాను కానీ పని చేయట్లేదు అంటే.....
మన ప్రియతమ నేత ప్రతి స్పందన.. సభ్య సమాజం సిగ్గుపడేలా వుంది..

అమ్మా నీది ఏ వార్డు!
నీది ఈ వార్డు కాదు..కదా.... నీ వార్డు లో రచ్చ బండ జరిగినప్పుడు నీ సమస్యను చెప్పు అని ...
ఆమె ఇచ్చిన వినతి పత్రాన్ని చెత్త బుట్ట దాఖలాలు చేసిన పెద్దమనిషి... మన సీఎం..
రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్న నేత వ్యవహరించే పద్ధతేనా ఇది????
ఇలాంటి వ్యక్తికి నైతికంగా....అసలు నాయకుడిగా వుండే అర్హత లేదు....

****ఇలాంటి వ్యక్తులను ఎన్నుకునేందుకేనా...మన ప్రజా ధన్నాన్ని వృధా చేసుకొని మరీ... నెత్తిన కూర్చోబెట్టుకుంటున్నాం!

ప్రజల కష్టాలకు ఆసరాగా ఉండేందుకు తప్పించుకో జూసిన ఇదే ముఖ్యమంత్రి...
అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ముగ్గరు మంత్రులకు న్యాయ సహాయం చేసేందుకు ప్రభుత్వ సహాయం అందిస్తాడంట...
లక్షల రూపాయలు ప్రతి నెలా గౌరవ వేతనాలు తీసుకునే ఈ నేతలకు డబ్బు కొదవా!
ఇంత కంటే సిగ్గు మాలిన పని ఇంకొకటి లేదు....

****ఒక ప్రభుత్వాసుపత్రిలో... "వీణా -వాణీ" అవిభక్త కవల తల్లి దండ్రులు ఎన్నో ఏళ్ళగా వారిని విడదీసి వారి జీవితాలలో వెలుగులు నింపమని ప్రభుత్వ నేతల కాళ్ళా వెళ్ళా పడుతున్నా...
దున్న పోతుమీద వర్షం పడ్డట్లు వ్యవహరించే ఈ నేతలు... ఇలాంటి విషయాలలో...
పెద్దలకు అడుగులకు మడుగులోత్తేలా.... ప్రభుత్వపని తీరును మార్చేస్తుంటే....
ఇంకెంత కాలం....ఏ అన్యాయ పరిపాలన క్రింద పేద బ్రతుకులు నలిగి పోవాలి!